కరాటేలో డాక్టర్ రేటు పట్టా పొందిన సుంకర యాదయ్య పటేల్
తెలంగాణ: ఆత్మరక్షణకు, శరీర దృఢత్వానికి, మానసిక వికాసానికి కరాటే ఎంతో ముఖ్యమని తెలిసి చిన్నప్పటినుండి కరాటే ప్రధాన వృత్తిగా చేసుకొని వివిధ స్కూళ్లలో విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం నేర్పుతున్న జమ్మికుంట ప్రాంతానికి చెందిన సుంకర యాదయ్య పటేల్ ఔరంగాబాద్ లో గ్లోబల్ యూనివర్సిటీ నుండి డాక్టర్ పట్టా సంపాదించాడు. తాను పిఈటిగా స్కూళ్లలో విద్యార్థులకు వ్యాయామంతో పాటు స్పోర్ట్స్ క్రీడారంగంలో ప్రావీణ్యం కల్పించే ఎందరో విద్యార్థులకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు వారికి లభించే విధంగా కృషి చేశానని యాదయ్య అవార్డు తీసుకున్న సందర్భంగా తెలియజేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే మహిళ యువత కరాటే నేర్చుకుంటే ఇది వారికి ఆత్మరక్షణగా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మహిళలకు తెలియజేశాడు. వీరికి డాక్టర్ రేటు వచ్చిన సందర్భంగా స్థానిక నాయకులు,సామాజిక వర్గానికి చెందిన కుల నాయకులు యాదయ్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.