త్వరలో రాష్ట్ర మున్నూరు కాపు ఎన్నికలు జరుగును
తెలంగాణ: రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి శ్రీనివాసు సికింద్రాబాద్ నామాల గుండు ఎన్ బీఆర్ ఫంక్షన్ లో మార్చి 23 ఆదివారం రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి తెలియజేశారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ జీవిత సభ్యత్వము బైలాస్ ప్రకారం కేవలం 200 రూపాయలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇట్టి సభ్యత్వమును తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు విధిగా తీసుకోవాలని కోరారు. ఇట్టి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్, సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చేపూరి వెంకటేశ్వరరావు,మహిళా అధ్యక్షురాలు చామకూర సుజాత, న్యాయవాది అన్నపూర్ణ నాచారం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తిప్పిరి రాజబాబు ప్రధాన కార్యదర్శి రవీందర్ పటేల్, సంఘ నాయకులు ఉగ్గే శ్రీనివాస్ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కులం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి బాదే పద్మారావు మృతి పట్ల చింతిస్తూ వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మన జాతికి తీరని లోటుగా భావిస్తున్నట్లు వారికి రెండు నిమిషాలు మౌనం తెలియజేశారు.
నాచారం మున్నూరు కాపు సంఘానికి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శ్రీనివాస్ వారికి అనుబంధ సంఘంగా గుర్తింపు ధ్రువ పత్రాన్ని రాజబాబు, రవీందర్ లకు అందజేశారు.