సావిత్రిబాయి పూలేకు ఎంపీ వద్దిరాజు నివాళి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రిభాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి,రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.