జనసేనలోకి పారిశ్రామిక వేత కంది రవిశంకర్ చేరిక
ఆంధ్ర ప్రదేశ్ : ఒంగోలు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రవిశంకర్ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు, విశ్వాసనీయ వర్గాల ద్వారా తెలియ వచ్చింది, పార్టీలో చేరి ప్రజాసేవ చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.వీరి వియ్యంకుడు, సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో పాటు రవిశంకర్ జనసేనలో చేరనున్నారు. వీరు చేరికపై ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బలిజ కాపు తెలగ సామాజికవర్గానికి చెందిన రవిశంకర్ కు ఒంగోలులో అన్ని సామాజిక వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఎన్నో సంవత్సరాల నుండి తన సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి వీరి చేరికతో మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు జనసేన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.