విద్యార్థినులకు సత్కరించిన మున్నూరు కాపు సంఘం
ఖమ్మం: జిల్లాలో పదవ తరగతిలో మెుదటి ర్యాంకు రాష్ట్ర ర్యాంకులు సాధించిన మున్నూరు కాపు విద్యార్థి, విద్యార్థలకు మున్నూరుకాపు రాష్ట్ర జిల్లా సంఘం తరఫున శుక్రవారం ఖమ్మం నగరానికి చెందిన ముత్యాల గోవర్ధన్-స్వప్నప్రియల వారి కుమారుడు అఖిలేష్ 600 కి గాను 592 మార్కులు సాధించి జిల్లా మెుదటి స్థానంలో నిలిచాడు.అలాగే గోగం సురేష్ కుమార్-సత్యల వారి కుమార్తె పూజిత లక్ష్మీ 600 కి గాను 582 మార్కులు సాధించి జిల్లా,రాష్ట్ర స్థాయిలో నిలిచింది. వీరిద్దరికీ శాలువాతో సన్మానించారు.అనంతరం మున్నూరుకాపు రాష్ట్ర కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ నాయకులు శెట్టి రంగారావు మాట్లాడుతూ ఎస్ ఎస్ సి ఫలితాలలో ఉన్నతమైన ర్యాంకులు సాధించి మన మున్నూరు కాపు ప్రతిష్టను మరింత పెంచిన ఈ విద్యార్థి- విద్యార్ధీనీలను అభినందిస్తూ.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తూ అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీమతి పగడాల మంజుల,నగర అధ్యక్షులు మడూరి పూర్ణచంద్రరావు, 50 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్, సముద్రాల శ్రీనివాసరావు, రిటైర్డ్ డిఎస్పి నర్సయ్య, పర్వతనేని నాగయ్య,వెంకటేశ్వర్లు విద్యార్థి, తల్లిదండ్రులు ఆ ప్రాంత మున్నూరుకాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.