బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo
కరీంనగర్ జిల్లా: అందరిబంధువు, మున్నూరుకాపు ముద్దుబిడ్డ,మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక బొమ్మకల్ లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తెలంగాణ మున్నూరుకాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అనంతరం మాట్లాడుతూ బొమ్మ వెంకన్న తెలంగాణ ప్రజలు తో కాకుండా ఆంధ్ర కాపులతో సంబంధాలు కలిగి ఉండడం గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తిని కొనియాడారు. తన హయాంలో విద్యార్థి వసతి గృహం రూపకల్పన చేశారు. ఇలాంటి వ్యక్తి మున్నూరు కాపులకు ఒక పెద్ద నాయకుని గుర్తుంచుకోవడం నిజంగా మన అదృష్టం వక్తలు కొనియాడారు.
కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్టు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, కాపువాడ సంఘం అధ్యక్షులు బొమ్మ రాతి రామచంద్రం, మంకమ్మతోట అధ్యక్షులు ముప్పిడి సునీల్, జిల్లా మున్నూరుకాపు సంఘం సమన్వయకర్త సత్తినేని శ్రీనివాస్, మున్నూరుకాపు సంఘం నాయకులు కర్ర సూర్య శేఖర్, కళ్యాడపు ఆగయ్య, విద్యార్థి వసతి గృహం ఇంచార్జ్ ముప్పిడి బాల కృష్ణ , మునిపల్లి వనిత అను రాజ్ కుమార్, దీపక్ ప్రశాంత్, కోల సంపత్ రెడ్డి బొల్లం లింగమూర్తి పసుల్ల మైపాల్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.