తెలంగాణలో అలాయి బలాయి ఏర్పాటు అభినందనీయం
హైదరాబాద్: పర్వదినం రోజున మనమంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇచ్చేలా, తెలంగాణ ఆచార వ్యవహారాల గురించి ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా గత 19 సంవత్సరాలుగా గౌరవనీయులు,పెద్దలు గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ ఒక అద్భుతమైన కార్యక్రమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.వీరి కుమార్తె శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ కార్యక్రమం జరగడం, అందులో నేను పాలుపంచుకోవడం ఎంతో సంతోషం కలిగించింది. సంజయ్ వ్యక్తం చేశారు.తెలంగాణ సంస్కృతిలో భాగం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజల్ని ఏకం చేసిన వేదిక అయిన ‘అలయ్ బలయ్’ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న దత్తాత్రేయకు వారి కుటుంబ సభ్యులకు, నా తరఫున, యావత్ తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఐక్యతకు, సాంప్రదాయ సంస్కృతికి ప్రతీక. ఇక్కడి ప్రజల సాంప్రదాయ కళలను, సంస్కృతిని ప్రజలకు చేరువ చేయడంతో పాటు తెలంగాణ పండుగలు, సంప్రదాయాలను జాతీయం చేయడంలో కీలకమైన వేదిక. ఈ అలయ్ బలయ్ ద్వారా రాజకీయ, సామాజిక నాయకులు ఒకే వేదికపై వచ్చి ప్రజలతో పలు అంశాలపై చర్చలు జరపడం,వారితో ఆత్మీయంగా మెలగడం వంటి అనుభవాలు ప్రజాసేవకు, ప్రజా సంబంధాల అభివృద్ధిలో కీలకంగా ఉండడానికి ప్రత్యేకంగా తెలిపారు.