విద్యార్థికి గంజాయి మత్తు ఇచ్చి ఆపై అత్యాచారం
ఆంధ్ర ప్రదేశ్: తిరుపతి జిల్లా నగర పట్టణంలోని సహ విద్యార్థినికి గంజాయి మత్తు ఇచ్చి ఆపై అత్యాచారం చేసి, తన భార్యతో వీడియో తీయించి విద్యార్థికి బెదిరింపులు చేసి డబ్బులు, నగలు దోచుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇట్టి వీడియోలు తీసి అతనికి సహకరించిన అతని భార్య న్యాయం చేసే చదువు చదువుతూ తప్పుడు దారి తొక్కిన భార్యాభర్తలు,తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది.ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది.ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి మత్తులో ఉండగా కృష్ణకిషోర్ రెడ్డి ఆ యువతిని అత్యాచారం చేశాడు. దీన్ని కృష్ణకిషోర్ రెడ్డి భార్య ప్రణవకృష్ణ వీడియోలు తీసి ఆ యువతిని బెదిరించి నగదు, నగలు తీసుకున్నారు.ఆ తర్వాత ఆయువతి తమ్ముడికి, కాబోయే భర్తకు ఈ వీడియోలు పంపి డబ్బులు డిమాండ్ చేయగా యువత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ భార్యభర్తలను అరెస్ట్ చేయగా, విశ్వవిద్యాలయం వాళ్లు ఇద్దరిని సస్పెండ్ చేశారు.