కేడల కమలమ్మ దశదినకర్మ కు హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం

0

వరంగల్ జిల్లా: ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన గోపాల విజయలక్ష్మి వారి తల్లి  అలాగే సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు అత్తగారైన కేడల కమలమ్మ అకాల మరణం చెందడం బాధాకరంగా భావిస్తూ వారి సంతాప సూచనగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం లో రంగసాయిపేట ప్రాంతం కమలమ్మ దశదినకర్మ గురువారం రోజున తన స్వగృహంలో జరిగినది. దీనికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అధికారి హజారి రమేష్ పటేల్, సీనియర్ జర్నలిస్టు కాపు వికాసం మాసపత్రిక సంపాదకులు మాలి.కరుణాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్టు గోపాల రమేష్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ,గోపాల సరిత, విచ్చేసి కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *