డాక్టర్ గైనేని స్వరూప రాణి కి నివాళులర్పించిన రాష్ట్ర నాయకులు
తెలంగాణ: వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు రాజకీయవేత గైనేని రాజన్ వారి ధర్మపత్ని ప్రముఖ వైద్య నిపుణురాలు శ్రీమతి డాక్టర్ గైనేని స్వరూప రాణి ఈరోజు ఉదయం వరంగల్ స్వగృహంలో గత కొన్ని రోజుల నుండి అనారోగ్యానికి గురవుతూ ఈరోజు శనివారం,వారి స్వగృహం నందు మృతి చెందారు .మున్నూరుకాపు రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ ఈ సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్,కాపు వికాసం పత్రిక సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు పటేల్, జిల్లా నాయకులు పోతు కుమారస్వామి,పెంచాల గోపాల్ తదితరులు స్వరూప రాణి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీరి మరణం ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు, స్వరూప రాణి వైద్యరంగంలో ఎంతోమందికి సేవలందించారని, రాజన్ కు ఎంతో అండదండగా ఉండే వారని,వీరి ఎదుగుదలకు చాలా సహకారం డాక్టర్ అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వరూప రాణి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.