హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి కొండ సురేఖ పై అసభ్యంగా ట్రోలింగ్ పెట్టడంపై మనస్తాపం చెంది గాంధీభవన్లో మీడియా సమావేశంలో తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మీడియా ముందు కంటతడి పెట్టుకుంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులపై విమర్శలు లేవనెత్తారు. పార్టీలో మహిళల కార్యకర్తలపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని తీవ్రంగా ఖండించారు. అధికారం పోయినకూడా మీకు ఇంకా ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందని ధ్వజమెత్తారు. బీసీ బిడ్డలు మీకు త్వరలో గుణపాఠం చెబుతారని సురేఖ సవాల్ విసిరారు. గతంలో మంత్రి సీతక్కను కూడా ఇదేవిధంగా, గత గవర్నర్ పైన కూడా మీరు ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం తెలంగాణ ప్రజలు మిమ్ములను క్షమించారని ఆవేదనతో సురేఖ తెలియజేశారు. ఇలాంటి మహిళపై ఆరోపణలు చేయడం మీ కుటుంబ సభ్యులు మహిళలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలని మీడియా ముందు సురేఖ గుర్తు చేశారు. మంత్రి సురేఖ పై అసభ్యంగా సోషల్ మీడియాలో పెట్టడంపై తెలంగాణ మహిళలు బీసీ నాయకులు,మహిళ నాయకులు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పలు సంఘాలు తీవ్రంగా ఖండించారు.