సమాజంలో మనుషులు ప్రవర్తిస్తున్న వైనం…
హైదరాబాద్; చెట్టుకు ఓ గాడిద కట్టేయబడిఉంది. దానియజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు.ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది.ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని,మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది.ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి,ధ్వంసం చేసింది.దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య గాడిదను ఓగొడ్డలితో నరికేసింది.ఇది చూసి కోపం ఆపుకోలేక సదరు గాడిద యజమాని ఆ రైతు భార్యను వేటకొడవలితో నరికేశాడు.ఆమె భర్త ఊరుకుంటాడా.? ఓగునపం తీసుకొచ్చి ఆ గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు.వాడు వెంటనే చచ్చూరుకున్నాడు.గాడిద యజమాని భార్యకు ఆగ్రహం పట్టలేక, కొంగు నడుంకు బిగించి కొడుకులను రమ్మని కేకేసింది…వాళ్లంతా కలిసి ఆ రైతు ఇంటికి నిప్పెట్టారు.తన ఇంటిని మంటల్లో చూసి,ఆ బూడిదతో కళ్లు మండిపోయిన రైతు ఆ గాడిద యజమాని భార్యను,కొడుకులను వెంటాడి వెంటాడి చంపేస్తాడు.తరువాత కాసేపటికి ఆవేశం,తగ్గి,ఆ దెయ్యాన్ని అడుగుతాడు.‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావు..?’’దెయ్యం ఏమన్నదంటే..? ‘‘నన్ను అనవసరంగా నిందించకు… నేను ఒక్కరినైనా చంపానా..? చెట్టుకు కట్టేసి ఉన్న ఓ గాడిదను జాలితో విడిపించాను… అంతే… మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపుకున్నారు…’’మీడియా,సోషల్ మీడియా కూడా అంతే…రోజుకో గాడిద కట్లు తెంపేసి,సమాజం మీదకు వదిలేస్తయ్..మనం వాదాలు,ద్వేషాలతో తన్నుకుంటూ,పాత స్నేహాల్ని కూడా చంపేసుకుంటూ ఉంటాం.కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తుంటాం,జాగ్రత్త.?