చికిత్స పొందుతూ జర్నలిస్టు మృతి -సంతాపాన్ని వ్యక్తం చేసిన అధ్యక్షులు సోమయ్య
హైదరాబాద్, ఏప్రిల్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కూకట్ పల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతు సీనియర్ జర్నలిస్టు వై.నాగరాజు నేడు శనివారం ఉదయం మరణించారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య శనివారం సందర్శించి నివాళులర్పించారు.ఆయనతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోశాధికారి గోవిందరావు, జర్నలిస్టు పద్మారావు తదితరులు కూడా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం తనతో కలిసి ఆంధ్రజ్యోతిలో పని చేసిన నాగరాజు ఆ తర్వాత వివిధ పత్రికల్లో పని చేశారని, ప్రస్తుతం సొంత పత్రికను నడుపుతున్నారని గత అనుభవాలను గుర్తు చేశారు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య. నాగరాజు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తెలియజేశారు.