ఉద్యమ కళాకారుడు గజ్జల శ్రీనివాసు కు అవార్డు ప్రధానం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు సీనియర్ జర్నలిస్టు గజ్జల శ్రీనివాస్ పటేల్ కు నేడు బుధవారం అరుదైన గౌరవం హైదరాబాదులో దక్కింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తన ప్రాణ త్యాగంతో ఊపిరి పోసిన నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ అమరుడు శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డును వారి తల్లి శంకరమ్మ,OU JAC చైర్మన్ దరువు అంజన్న చేతుల మీదుగా అవార్డును శ్రీనివాస్ కు అందజేశారు. శ్రీనివాస్ తన మాటలలో నాకు ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో నిబద్దత, నిస్వార్థంగా పని చేసిన నాలాంటి ఉద్యమకారులను గుర్తించి, సత్కరించిన శ్రీకాంత్ చారి మెమోరియల్ సభ్యులకు, నింగి నేల- మేము సైతం మీ ఆత్మీయ నేస్తం వారికి కృతజ్ఞతలు. శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్ పేట్ పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ వారి సౌజన్యంతో జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.