బీసీ ఉద్యమం కోసం మున్నూరుకాపుల సమావేశం
వరంగల్: బీసీ రాజ్యాధికారంసాధించుటకోసం శ్రమిస్తూ.బీసీ వర్గాలను చైతన్యం తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్న మున్నూరుకాపు కులబాంధవుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు 26/1/2025 ఆదివారం,5 గంటలకు దసరా రోడ్డు,ఉర్సుగుట్ట దగ్గర మున్నూరుకాపు పరపతి సంఘానికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతిస్తూ.ఈఉద్యమంలో మున్నూరు కాపులు పెద్దన్న పాత్ర పోషించుటకోసం ఎంతైనా ఉంది. ఈ ఉద్యమంలో మున్నూరుకాపులు నడుంబిగించుటకు సమయం ఆసన్నమైంది. మున్నూరుకాపులు BC ఉద్యమంలో ఇతర కులాలకు దీటుగా ముందు వరసలో మున్నూరుకాపు ఉండే విధంగా మనమందరం ఏకమవుదాం.జై మున్నూరుకాపు జై జై బీసీ ఐక్యత అనే నినాదంతో జిల్లాలో ఉన్న మున్నూరుకాపులు పెద్దలు జిల్లాలో ఉన్న సంఘాల నాయకులు ఈకార్యక్రమానికి విచ్చేయగలరని అలాగే మల్లన్నకు మన మున్నూరుకాపు సంఘం తరఫున ఘనంగా స్వాగతం తెలుపుట కోసం మున్నూరుకాపులు విధిగా తప్పనిసరిగా రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.వివరాల కోసం డాక్టర్ పర్వతం వెంకన్న పటేల్,సెల్:91775 66741,మాలి కరుణాకర్ పటేల్,ఎడిటర్ 9346078884 సంప్రదించండి.