UGC చట్టం అమలు కాకుండా చేస్తున్నారు, మనకు బాగా నష్టం?

తెలంగాణ :మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు చదువుకున్నా, లేకపోయినా ఒక విషయం మాత్రం తెలుసు.చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది.ఉద్యోగం వస్తే బతుకు మారుతుంది.అందుకే చదువు చాలా ముఖ్యం.ఆ చదువు దగ్గరే అసలు సమస్య వస్తుంది.
కాలేజీల్లో యూనివర్సిటీల్లో టీచర్లను, ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు యూజీసీ చట్టం. ఈ చట్టం చెప్పేది ఒక్కటే. నియామకాలు న్యాయంగా జరగాలి. అందరికీ అవకాశం రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి రిజర్వేషన్ అమలు చేయాలి.
కానీ నిజంగా ఏం జరుగుతోంది అంటే చట్టం ఉన్నా అది సరిగా అమలు కానీయకుండా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు మంచి మార్కులు వచ్చినా చివరికి వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం లేదు.కారణం ఏమిటంటే సూటబుల్ కాదు అని చెబుతారు.అంటే అర్హుడు కాదని కాదు.మాకు నచ్చలేదు అని మాత్రమే తెలుపుతారు.
అదే సమయంలో జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు తక్కువ మార్కులు తెచ్చినా వాళ్లను తీసుకుంటారు.ఇది బయటకు కనిపించదు. పేపర్లలో న్యాయంగా ఉన్నట్టు చూపిస్తారు.కానీ లోపల మాత్రం అన్యాయం జరుగుతుంది.
ఈ సూటబుల్ కాదు అనే మాటే పెద్ద మోసం.పోస్టు ఉంటుంది. రిజర్వేషన్ ఉంటుంది. అభ్యర్థి ఉంటాడు.కానీ ఉద్యోగం ఇవ్వరు.అలా ఇచ్చినట్టు చూపించకుండా పోస్టును ఖాళీగా వదిలేస్తారు. తర్వాత మళ్లీ ఆ పోస్టు జెనరల్ వైపు వెళ్లిపోతుంది. ఇదే చాలా ఏళ్లుగా జరుగుతున్న అన్యాయం.ఇప్పుడు యూజీసీ చట్టాన్ని గట్టిగా అమలు చేస్తే ఈ ఆట ఆగిపోతుంది. ఇంటర్వ్యూలలో మాయలు చేయడం కష్టం అవుతుంది. ఎవరికీ నచ్చితే వాళ్లకు ఇవ్వడం కుదరదు. మార్కులు అర్హత చూస్తే సరిపోతుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు నిజంగా అవకాశం వస్తుంది.అందుకే కొందరికి భయం. సంవత్సరాలుగా చదువు ఉద్యోగాలు వాళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు చట్టం సరిగా అమలైతే ఆ ఆధిపత్యం పోతుంది. అందుకే యూజీసీ చట్టం వద్దు అంటున్నారు. రిజర్వేషన్ సరిగా అమలైతే తమ పిల్లలకు అవకాశాలు తగ్గుతాయేమో అన్న భయం వాళ్లలో ఉంది.మరోవైపు బహుజనులు అంటే ఎక్కువ మంది ప్రజలు ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే చట్టం ఉంటే న్యాయం వస్తుందని నమ్మారు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. చట్టం ఉన్నా దాన్ని అమలు చేయనివ్వకపోతే న్యాయం రాదు అని.
ఇది కులాల మధ్య గొడవ కాదు. ఇది మనిషికి న్యాయం దక్కాలా లేదా అన్న ప్రశ్న. చదువుకున్నవాడు అర్హత ఉన్నవాడు ఉద్యోగం పొందాలా లేదా అన్న ప్రశ్న. రాజ్యాంగం చెప్పిన సమానత్వం నిజంగా అమలవాలా? లేదా అన్న పోరాటం.సూటిగా చెప్పాలంటే యూజీసీ చట్టాన్ని వ్యతిరేకించడం అంటే బహుజనులకు అవకాశాలు రాకూడదు అని చెప్పడమే.యూజీసీ చట్టానికి మద్దతు ఇవ్వడం అంటే అందరికీ సమాన న్యాయం కావాలి అని చెప్పడమే.
