పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి

0

హైదరాబాద్  వృత్తినే దైవంగా భావించి, తన తోటి సాహు జర్నలిస్టుల మనోభావాలను అవలింబింపజేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు చాలామంది కడు దయనీయ పరిస్థితుల్లో కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి అండగా నేనున్నానంటూ ది జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎలక్షన్ల బరిలో దిగుతున్న డాక్టర్  బొల్లం తిరుపతి గురించి… వీరు ఒక సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి జర్నలిజంలో అడుగుపెట్టాడు. జర్నలిజం వృత్తిలో డాక్టర్ పట్టాపుచ్చుకొని తన అనుభవాలను పంచుకున్నారు, వీరు దాదాపు 28 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారని గతంలో1997లో ప్రజాశక్తి దినపత్రికలో జర్నలిజం ప్రస్థానం మొదలు పెట్టి విశాలాంధ్ర,వార్త,మా టీవి,Tv5,Ntvతో పాటు.ప్రస్తుతం tv9 లో పదహారు ఏళ్ల పాటు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారని తెలియజేశారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో PhD,PDF ఫూర్తి చేశారు, PhD పట్టా పొంది తర్వాత PDF అవార్డు కూడా కైవసం చేసుకున్నారు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా వంద మందికి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసర్చ్ (ICSSR) సంస్థ ఇచ్చే PDFను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జర్నలిజంలో పొందిన తొలి వ్యక్తి. వృత్తి జీవితంలో తనకున్న అనుభవాలను ఐదు పుస్తకాలుగా రాశారు. తనకున్న జర్నలిజంలో అవగాహన,పరిశోధనలో  తెలుసుకొని విషయాల అపార అనుభవంతో “ది జర్నలిస్ట్ కో అపరేటీవ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్” మేనేజింగ్ కమిటీకి డిసెంబర్18 న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన ప్రవర్తన, వ్యక్తిత్వం తెలుసుకొని మీ అమూల్యమైన ఓటు వేసి మన వారితో కూడా మద్దతు తెలుపాలని తెలియజేస్తూ.  ఓటు రూపంలో మీ ఆశీర్వాదాన్ని అందించి డైరెక్టర్ పదవికి ఎన్నుకోవాలని, వేడుకుంటూ ఎన్నికల అనంతరం న్యాయమైన మన డిమాండ్ల సాధన కోసం శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని మీ అందరికీ  హామీ ఇస్తున్నానని తెలియజేశారు. సీనియర్లకు తన వ్యక్తిత్వం గురించి  తెలియజేసి వారి మద్దతు కూడా తనకు లభించే విధంగా కృషి చేయాలని తిరుపతి కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *