అభివృద్ధికి నోచుకోకున్న హుస్నాబాద్ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా : మూడు దశాబ్దాలుగా హుస్నాబాద్ (పాతఇందుర్తి) నియోజకవర్గంలో జరిగిన ఆధిపత్య పోరు వల్ల ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని సీనియర్ జర్నలిస్ట్, రచయిత మంగళారపు లక్ష్మణ్ అన్నారు,శనివారం హుస్నాబాద్ బిఎల్ఆర్ గార్డెన్ లో జరిగిన పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో తాను రాసిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు మంగళారపు లక్ష్మణ్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు, అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఒకవైపు కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టితో ఈ ప్రాంతం వెనుకబడిపోతే, మరోవైపు నక్సలిజం, సిపిఐ, తెలుగుదేశంపార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరు వల్ల ఐదు దశాబ్దాలుగా వెనుకబడి పోయిందని లక్ష్మణ్ ఆవేదనతో వ్యక్తం చేశారు, ఈ నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చోవడం వల్ల కూడా శాపంగా మారిందన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఈ నియోజక వర్గం నుండి శాసన సభ్యులుగా ఎన్నికైన మంత్రి పొన్న ప్రభాకర్ మంత్రి కావడం పట్ల కొంత మేలు జరిగే అవకాశం ఉందన్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగేలా కృషి చేయాలని అన్నారు,ప్రభుత్వంలో సరైన నిధుల లేనట్లు, ప్రజలు అపోహలో ఉన్నారు, అభివృద్ధి చేస్తుందో లేదో అన్న అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయని, తెలియజేస్తూ, మంత్రి ఈ నియోజకవర్గ వర్గంపై ప్రత్యేక దృష్టి సాధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరారు,1978-79 విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా,కను విందుగా జరిగింది, ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ చాడ మధుసూదన్ రెడ్డి, మాట్లాడుతూ మిత్రులు మంగళారపు లక్ష్మణ్ రాసిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర ఈ ప్రాంతం వాసులు ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉందన్నారు, ప్రముఖ సాహితీ వేత్త ఆర్టిస్ట్ జాతీయ అవార్డు గ్రహీత బి మల్లయ్య మాట్లాడుతూ మంగళారపు లక్ష్మణ్ ఎన్నో రోజులు పలు కష్ట నష్టాల కోర్చి పుస్తకం రచింపజేసి ఈ ప్రాంత చరిత్రకు అద్దం పడుతున్నట్లు ఉందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పూర్వ విద్యార్థులు పలువురు పాల్గొని ప్రసంగించారు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కృష్ణకుమారి, శ్రీమతి మాధవి లత రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, బి. లక్ష్మారెడ్డి, కొండ్లే వెంకటేష్ పలువురు ఉపాధ్యాయులు వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.