కార్గో నౌకపై క్షిపణులతో హౌతీల దాడి

0

యెమెన్‌ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ నౌకలకే నష్టం వాటిల్లింది. అయితే, హౌతీ రెబల్స్‌ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.

గ్రీస్‌ యాజమాన్యానికి చెందిన ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ (True Confidence) కార్గో నౌక బార్బడోస్‌ జెండా (Barbados-flagged)తో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది. ఆ నౌకపై గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ (Gulf Of Aden)లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు (Missile Hits). ఈ దాడిలో కార్గో నౌక తీవ్రంగా దెబ్బతినింది. ఈ ఘటనలో ముగ్గరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *