ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా ,మంచిగా చదువుకొని,ఉద్యోగం చేయమని బెంగళూరుకు పంపిస్తే బెట్టింగ్ పేరుతో మోసపోయి తల్లిదండ్రులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన కొడుకు, ఇలాంటివారు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం రెండు రోజుల క్రితం దంపతుల ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైరల్ అయింది, కర్నూలు జిల్లాలో నంద్యాల అబ్దుల్లాపూర్ చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు కోట్ల నలభై లక్షలు అప్పు చేశాడు. ఇతని తల్లిదండ్రులు వాళ్ల ఉన్న పది ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు.అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో దంపతులిద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు.