పరిహారం అందించిన ఇండియన్ బ్యాంక్ సిబ్బంది
అదిలాబాద్ జిల్లా :గత నెల అనారోగ్య సమస్యతో మరణించిన అదిలాబాద్ పట్టణానికి చెందినా సాట్లవార్ సంజయ్ కుటుంబ సభ్యులకు ఇండియన్ బ్యాంక్ వారి జీవన్ జ్యోతి భీమా యోజనా ద్వారా 200000 రూపాయలను తన భార్య జ్యోతి కి బాండ్ రూపంలో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ మేనేజర్ శివకుమార్ చేతుల మీదుగా అందించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రత్ మాట్లాడుతూ నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవన్ జ్యోతి భీమా యోజనా ద్వారా బాధిత కుటుంబాలకు త్వరిత గతిన పరిహారం అందించడం చాలా గొప్ప విషయమని, బ్యాంక్ సిబ్బంది కూడా తమ యొక్క అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదించి, తక్కువ సమయంలోనే పరిహారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్య్రమంలో ఆగ్రో ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు సంతోష్, వ్యాపారులు యంబేడివార్ అశోక్, రేణుకా సతీష్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.