మహిళా సొసైటీ నియామక పత్రం అందజేసిన ప్రభుత్వ విప్
తెలంగాణ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ లక్ష్మక్కపల్లి లోని విపిజే ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన మున్నూరుకాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగినది. సొసైటీ కార్య నిర్వహణ అధికారి సర్దార్ పుటం పురుషోత్తంరావు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.మున్నూరుకాపు మహిళలు ఈ సొసైటీని ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుని సొసైటీ ద్వారా వచ్చే వస్తువులను పొందాలని తెలుపుతూ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా MACTCS వెబ్సైట్ ను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీనివాస్ ప్రారంభించారు.నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎండోమెంట్ ఏవో అన్నపూర్ణ, బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత తూడి ప్రవీణ్ కుమార్, మున్నూరుకాపు అపెక్స్ కమిటీ సభ్యులు రౌతు కనకయ్య, బొమ్మ శ్రీరామ చక్రవర్తి, సొసైటీ అధ్యక్షురాలు అరుణ కు నియామకాని పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి సొసైటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.